ETV Bharat / state

సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో విచారణ వేగవంతం

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై విచారణ వేగవంతమైంది. ఆళ్లగడ్డ జూనియర్ సివిల్ జడ్జి ఎం .శైలజ సమక్షంలో సీఆర్​పీసీ 164 కింద అబ్దుల్ సలాం అత్త మహబూబ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో విచారణ వేగవంతం
సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో విచారణ వేగవంతం
author img

By

Published : Nov 24, 2020, 9:14 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై విచారణ వేగవంతమైంది. జిల్లా ఫస్ట్​క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ జూనియర్ సివిల్ జడ్జి ఎం .శైలజ సమక్షంలో సీఆర్​పీసీ 164 కింద అబ్దుల్ సలాం అత్త మహబూబ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆమె కూతురు, కుమారుడు వలి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మహబూబ్ న్యాయస్థానంపై తనకు గౌరవం ఉందని తమకు తప్పక న్యాయం జరుగుతుందన్నారు. తన అల్లుడి కుటుంబం ఆత్మహత్య ఘటనలో నిందితులైన సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్​లను ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు. గతంలో తన అల్లుడు పనిచేసిన బంగారం దుకాణం యజమాని, అతడి కుమారుడిపై కేసు కూడా నమోదు చేసి విచారణ చేయాలన్నారు. ఆ దొంగతనాలకు సంబంధించి నిజానిజాలు వెలికి తీయాలన్నారు.

ఇదీచదవండి

వెండి ఆభరణాల తయారీ కార్మికుడిపై యజమాని దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.