ETV Bharat / state

‘గోప్యత’ను వినియోగించుకోవాలి - taja news of social security issue in e rakhabandhan programme

సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు, వ్యక్తిగత విషయాలు, వాటి గోప్యత తదితర అంశాలపై ఈ- రక్షాబంధన్ కార్యక్రమంలో చర్చించారు.‘‘సామాజిక మాధ్యమాల్లో సురక్షితంగా ఉండటం ఎలా?’’ అనే అంశంపై ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో వెబినార్‌ జరిగింది.

programme on social media security issue in e rakshabandhan programme

author img

By

Published : Aug 7, 2020, 10:03 AM IST

సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసే వ్యక్తిగత చిత్రాలు, సమాచారం, తదితర వివరాలు ఇతరుల బారిన పడకుండా ఉండేందుకు వాటిల్లోని గోప్యత సదుపాయాన్ని (ప్రైవసీ సెట్టింగ్‌ను) వినియోగించుకోవాలని ట్విటర్‌ ప్రజా విధానాల విభాగం (భారత్‌) సీనియర్‌ మేనేజర్‌ షాగుఫ్తా కర్మన్‌, ఫేస్‌బుక్‌ పాలసీ ప్రోగ్రామ్స్‌ మేనేజర్‌ శృతి మోఘేలు పేర్కొన్నారు.

ఆయా మాధ్యమాల్లో పోస్టు చేసే వాటిల్లో ఏవైనా అభ్యంతరకరమైనవి ఉంటే...వాటిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా స్వచ్ఛందంగా గుర్తించి తొలగించే వ్యవస్థ తమ సంస్థల్లో అందుబాటులో ఉందని వివరించారు. ‘‘ఈ-రక్షాబంధన్‌’’ కార్యక్రమంలో భాగంగా ‘‘సామాజిక మాధ్యమాల్లో సురక్షితంగా ఉండటం ఎలా?’’ అనే అంశంపై ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో వెబినార్‌ జరిగింది.

సైబర్‌ సేఫ్టీ మిషన్‌ ప్రతినిధి అనిందిత మిశ్ర కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు కొంతమంది ప్రముఖుల పోస్టింగులను పలువురు మార్ఫింగ్‌ చేసి అచ్చం వాటి తరహాలోనే మిర్రర్‌ ఇమేజేస్‌, ఇమిటేషన్‌ ప్రొఫైల్స్‌ సృష్టిస్తున్నారని... వారిని గుర్తించి పట్టుకునేందుకు సంస్థల నుంచి సహకారం అవసరమని సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్‌ చెప్పారు.

ఫేస్‌బుక్‌, ట్విటర్‌ తదితర సామాజిక మాధ్యమాలన్నింటి పాస్‌వర్డ్‌ ఒకేలా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టి ఆ తర్వాత వాటిని తొలగించేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో వారిపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఆ పోస్టుకు సంబంధించిన యూఆర్‌ఎల్‌ లింక్‌ను సేవ్‌ చేసుకోవాలి. పోస్టుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ తీసి భద్రపరుచుకోవాలని సీఐడీ డీఐజీ సునీల్‌ నాయక్‌ తెలిపారు.

ఇదీ చూడండి

పోలీసులు ఏం చేస్తున్నారు... దిశచట్టం అమల్లో ఉందా..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.