ప్రభుత్వాసుపత్రిలో సరైన వసతులు లేక గర్భిణులు ఇబ్బందులకు గురవుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రతినెల 9వ తేదీన గర్భిణులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. అయితే స్కానింగ్ పరీక్షల కోసం వెళ్లే గర్భిణులు ఎండలో నిలబడాల్సి వస్తుంది. సరైన సదుపాయాలు లేక కొంతమంది కిందనే కూర్చోవల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు.
ఇవీ చదవండి...పాపం గర్భిణులు.. తప్పట్లేదు డోలీ మోతలు!