కోవిడ్-19 విధుల్లో ఉన్న వారికి రక్షణగా ఉపయోగపడే 500 పీపీఈ కిట్లను జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులు విరాళంగా ఇచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి వీటిని అందజేశారు.
ఒక్కో కిట్ రూ.2500 విలువ చేస్తుందని వారు తెలిపారు. వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి వీటిని అందచేయాలని కోరారు. ఈ సందర్భంగా.. వారిని ఎమ్మెల్యే అభినందించారు.
ఇదీ చూడండి: