ETV Bharat / state

అక్రమ రవాణాలకు పోలీసుల చెక్

author img

By

Published : Apr 12, 2021, 9:46 AM IST

రాష్ట్రంలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన అక్రమ రవాణాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనల్లో అక్రమ కర్ణాటక మద్యంతో పాటు.. రెండు ఇసుక టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు.

illegal transport
అక్రమ రవాణాలు

కర్నూలు జిల్లా నందవరం మండలంలోని కనకవీడు వద్ద కర్ణాటక మద్యం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 1950 కర్ణాటక మద్యం ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేశారు. చంద్ర, సోమన్న పట్టుబడగా.. వెంకటప్ప నాయుడు, రాజు అనే నిందితులు పారిపోయారని సీఐ మహేష్ చెప్పారు.

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక టిప్పర్లను ఎస్​ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఇసుక రీచ్ నుంచి ఈ టిప్పర్లలో యాభై టన్నుల ఇసుక తరలిస్తుండగా జాతీయ రహదారిపై అధికారులు అడ్డుకున్నారు. వీటిని దుండగులు మేనకూరు సెజ్​లోని కంపెనీల వద్ద నిర్మాణానికి.. తరలిస్తున్నట్లు గుర్తించారు.

ఇదీ చదవండి:

ఆ 6 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్​లో.. ఇకపై వాహనాలు దూసుకెళ్తాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.