కర్నూలు జిల్లాలోని పట్టణ కేంద్రంలో నాలుగు గోడౌన్లలో 93 టన్నులు రేషన్ బియ్యాన్ని గుర్తించి.. వాటిని పోలీసులు సీజ్ చేశారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై పోలీసులు దాడులు చేశారు. నగరంలోని పలు గోడౌన్లలో అక్రమ నిల్వలు ఉన్నాయనే సమాచారంతో డీఎస్పీ కేవీ మహేశ్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు గోడౌన్ నిర్వహకుల్నీ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.
గుజరాత్‌కు తరలిస్తుండగా..
కర్నూలు సమీపంలోని తడకనపల్లె గ్రామం వద్ద ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను తనీఖీ చేస్తుండగా.. ఓ లారీలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బియ్యాన్ని డోన్‌కు చెందిన మహమ్మద్ రఫీ అనే వ్యక్తి గుజరాత్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 25 కేజీల బరువు గల 1200 ప్యాకెట్లను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: అక్రమ మద్యం పట్టివేత.. ఒకరు అరెస్ట్