ప్రజలను రక్షించే పోలీసే.. తన భార్యను వేధించి, చంపేసిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. జిల్లాలోని కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ధరణి అనే మహిళను.. తన భర్త చంద్రశేఖర్ హత్య చేశాడు. చంద్రశేఖర్ కర్నూలు రెండవ పట్టణ పోలీసు స్టేషన్లో.. విధులు నిర్వహిస్తున్నాడు. మూడు నెలలుగా ధరణిని అత్తింటివారు వేధింపులకు గురి చేస్తున్నారని మృతిరాలి తల్లి తెలిపారు. అన్నంలో మత్తు మందు కలిపి.. నిద్రపోయిన సమయంలో దిండుతో ఊపిరి ఆడనీయకుండా చంపారని ఆమె ఆరోపించారు. ఘటనపై తాలూకా పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు.
ఇదీ చదవండి: