కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆదోని నుంచి డోన్ వెళ్తున్న బొలేరో వాహనంలో అధికారులు తనిఖీ చేశారు. అందులో అక్రమంగా తరలిస్తున్న 76 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి డ్రైవర్‌తో పాటు మరొక ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారందరిపై కేసు నమోదు చేశామని మూడో పట్టణ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
రేపు రాష్ట్ర బడ్జెట్.. పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు