హైదరాబాద్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ గేటు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 3 కోట్ల 84 లక్షల 70 వేల రూపాయలు విలువ చేసే 177 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడైన లారీ డ్రైవర్ కర్నూలుకు చెందిన శివ కుమార్‌గా గుర్తించారు. అతడిని విచారించగా విశ్వనాథ్ రెడ్డి అనే వ్యక్తికి చెందినవని తెలిపాడు. విశ్వనాథ్ రెడ్డిని గత నెలలోనే టంగుటూరు పోలీసులు అరెస్టు చేశారు. విశ్వనాథ్ రెడ్డి చెప్పిన మేరకు ఎర్ర చందనం దుండగులు తరలిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
Illegal land registrations : అక్షరం చేర్చి నిషిద్ధ భూముల రిజిస్ట్రేషన్లు