లాక్డౌన్ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో తెల్ల రేషన్ కార్డుదారులకు 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు ఉచితంగా పంపిణీ చేశారు. సరుకులు తీసుకునేందుకు ప్రజలు చౌక ధరల దుకాణాల వద్ద బారులు తీరారు. సామాజిక దూరం పాటిస్తూనే సరుకులు తీసుకున్నారు. రైతు బజార్ల వద్ద కూడా ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజలు బాధ్యతగా ఉంటున్నా.. మరికొన్ని చోట్ల ఆ పరిస్థితి కనిపించడం లేదు.
నంద్యాలలోనూ
ఉచిత రేషన్ కోసం నంద్యాలలోనూ ప్రజలు ఉదయం నుంచే చౌక దుకాణాల వద్ద బారులు తీరారు. అధికారుల సూచన మేరకు జనం సామాజిక దూరం పాటించి సరుకులు తీసుకున్నారు.