ETV Bharat / state

Taxes Hike: పూటగడవటానికే కష్టంగా ఉంటే.. ఇన్ని పన్నులా..? - కర్నూలు జిల్లాలో పన్నులు పెరుగుదల

కొవిడ్‌తో సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలు తలకిందులైపోయాయి. ఆర్థికంగా చితికిపోయారు. నిత్యావసర, ఇంధన ధరలు ఊపిరి ఆడనివ్వట్లేదు. ఇన్ని కష్టాల మధ్య బతుకుబండి ఎలాగోలా నెట్టుకొస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పన్నుల విధానం.. మధ్యతరగతిపై మరింత భారం మోపనుంది.

people protest due to taxes at kurnool
కర్నూలు జిల్లాలో పన్నులు
author img

By

Published : Jun 24, 2021, 6:00 PM IST

కర్నూలు జిల్లాలో పన్నులు

కరోనా వేళా బతకడానికే ఇబ్బందిగా ఉంటే.. ప్రభుత్వం విధించే పన్నుల వల్ల మరిన్ని కష్టాలు ఎదుర్కొంటామని ప్రజలు వాపోతున్నారు. పన్ను పెంపును రద్దు చేయాలని వారు కోరుతున్నారు.

మరీ ఇంత పన్నా..?

రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో ఆస్తి విలువ ఆధారిత పన్ను, చెత్త పన్ను విధింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఆస్తి పన్ను పెరుగుదల.... 15 శాతానికి పరిమితం చేశామని చెబుతున్నా.. ఏటా ఆస్తి విలువతో పాటు అదీ పెరుగుతూనే ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ విలువ సర్వే చేయాలని.. ఆన్‌లైన్‌లో అది నమోదు కాని పక్షంలో సర్వే చేసి పొందుపర్చాలని ప్రభుత్వం నుంచి జిల్లాలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

కర్నూలులో 5 సెంట్ల స్థలంలో 1500 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మిస్తే.. కొత్త విధానంలో లెక్కిస్తే స్థలం, నిర్మాణ విలువ కలిపి మొత్తం 61లక్షలు అవుతుంది. దీనిపై పన్నుగా 0.15శాతం అంటే 9వేల 150... లైబ్రరీ సెస్‌గా మరో 732 రూపాయలు కలుపుకుని మొత్తం 9వేల 882 రూపాయలు కట్టాల్సి వస్తుంది.

పన్ను పెంపును రద్దు చేయాలి

కరోనా కష్టాల వేళ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో గతేడాది పన్నులు మినహాయించగా.. ఏపీలో అదనపు భారాన్ని వడ్డిస్తున్నారని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. పన్నుల విధానాన్ని నిరసిస్తూ కర్నూలులో ఆస్తి పన్నుల వ్యతిరేక కమిటీ గళం వినిపిస్తోంది. వివిధ కాలనీల సంఘాలు, బిల్డర్లు ధర్నా చేపట్టారు. పన్ను పెంపును రద్దు చేయాలని నగరపాలక సంస్థ కౌన్సిల్‌లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని.. మేయర్‌ రామయ్యకు వినతిపత్రాలు అందించారు. జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

Chandrababu: 'మామిడి రైతులకు ధరల స్థిరీకరణ సంస్థ ఏర్పాటు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.