కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం నుంచి మళ్లీ వలసలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఆశించిన వర్షాలు కురవక స్థానికంగా సాగు పనులు లేవు. అరకొరగా వేసిన పత్తి, మిరప పంటలకు తెగుళ్లు సోకి రైతులు అప్పుల పాలయ్యారు. ఉన్న ఊరిలో కూలి దొరక్క, ఉపాధి హామీ పనులకు వెళ్లినా.. బిల్లులు రాక సతమతమవుతున్నారు. ఆదివారం ఒక్కరోజే కోసిగి మండల కేంద్రంలోని 2, 3, 4వ వార్డులకు చెందిన 3 వేల మందికిపైగా ఇరవై వాహనాల్లో కర్ణాటకలోని యాదగిరి జిల్లాకు వలస (సుగ్గి) వెళ్లారు.
ప్రస్తుతం అక్కడ పత్తి తీత పనులు జోరుగా సాగుతున్నాయని, పెద్దలకు రూ.400, చిన్నారులకు రూ.200 దాకా కూలీ దొరుకుతుందని చెప్పారు. కొందరు గ్రామ వాలంటీర్లు సైతం కూలీలతో కలిసి వలసబాట పట్టడం కరవుకు అద్దం పడుతోంది. కర్నూలు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచీ ఈ సీజన్‌లో దాదాపు రెండు లక్షల మంది కర్ణాటక, తెలంగాణకు వలస వెళ్లనున్నట్లు అంచనా.
ఇదీ చూడండి: ఆ విషయమై గొడవ.. జవాన్ల మధ్య కాల్పులు.. నలుగురు మృతి!