ETV Bharat / state

అబ్దుల్ సలాం కేసులో నిందితులకు బెయిల్​ మంజూరుపై ప్రజాసంఘాల ఆగ్రహం - Abdul Salam Judicial Committee news

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుళ్లకు బెయిల్ మంజూరుపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.

Abdul Salam case
అబ్దుల్ సలాం న్యాయపోరాట కమిటీ సభ్యులు
author img

By

Published : Nov 10, 2020, 9:13 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల వాసి అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుళ్లకు బెయిల్ మంజూరు చేయటాన్ని ప్రజాసంఘాలు వ్యతిరేకించాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించిన 24 గంటల్లోనే బెయిల్​ మంజూరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసు విచారణలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి నిందితులకు బెయిల్​ మంజూరు చేయటాన్ని ఖండిస్తున్నామని అబ్దుల్ సలాం న్యాయపోరాట కమిటీ సభ్యులు అన్నారు. నాయకులు, అధికారులు కుమ్మకై ఈ విధంగా వ్యవహరించటం సరైందికాదని మండిపడ్డారు. సీబీఐతో కానీ, సిట్టింగ్​ జడ్జి బెంచ్​తో ఈ కేసు విచారణ జరిపించాలని కోరారు. నిందితులకు శిక్షపడేవరకు పోరాటం చేస్తామని అన్నారు.

ఇదీ చదవండి: 'సీఐ, హెడ్ కానిస్టేబుల్‌ బెయిల్‌ రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.