జీఓ ఎంఎస్-2 ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. కర్నూలులో పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోషియేషన్ నాయకులు సమావేశం నిర్వహించారు. గ్రామ సచివాలయ వ్యవస్థకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ జీఓను వెంటనే రద్దు చేయాలని వారు కోరారు. ముఖ్యమంత్రి చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని గ్రామ సచివాలయాల ద్వారా పంచాయతీ సెక్రటరీలు విజయవంతం చేశారని, ఇప్పడు కార్యదర్శులకు ఉన్న డీడీఓ అధికారాలను వీఆర్ఓలకు బదీలీ చేయటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.