కర్నూలు మార్కెట్‌లో ఉల్లిధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నానికి గరిష్ఠంగా క్వింటాలు ఉల్లి ధర రూ.12,860కి చేరుకుంది. వేలం పూర్తయ్యేసరికి ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులకు రాయితీపై ఉల్లి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబజార్లలో ఏర్పాటు చేసిన ఉల్లి సరఫరా కేంద్రాల్లో సైతం ఉల్లి నిల్వలు లేక వెలవెలబోతున్నాయి. దీంతో ఉల్లి కొనేందుకు వచ్చిన వినియోగదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కర్నూలు మార్కెట్‌కు గతంలో ప్రతిరోజూ సుమారు 5 నుంచి 6వేల క్వింటాళ్ల ఉల్లి దిగుబడులు వస్తుండగా, ప్రస్తుతం రోజుకు వెయ్యి క్వింటాళ్ల లోపు ఉల్లిపంట మార్కెట్‌కు వస్తోంది. ఈ దఫా ఉల్లి సాగు పూర్తికావడంతో దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు ప్రజలకు రాయితీపై ఉల్లి సరఫరా చేసేందుకు ఎంత ధరకైనా ఉల్లి కొనుగోళ్లు జరపాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. దీంతో యార్డు అధికారులు, వ్యాపారులు పోటీ పడి కొనుగోళ్లు చేస్తుండడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఇవీ చదవండి