రికార్డు స్థాయిలో క్వింటా ఉల్లి ధర కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రికార్డు స్థాయిలో అమ్ముడుపోవటంతో ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్వింటా ఉల్లి 5 వేల రూపాయల ధర పలకగా, కనిష్ఠంగా 900 కు అమ్ముడుపోయింది. సగటున క్వింటా ఉల్లి 3800 రూపాయలకు అమ్ముడైంది. 3953 క్వింటాళ్ల ఉల్లిని వ్యాపారులు కొనుగోలు చేయగా క్వింటా ధర ఐదువేల రూపాయలు పలకటం ఈ సీజన్లో ఇదే తొలిసారి. వర్షాలతో పంట కుళ్లిపోయి దిగుబడి తగ్గినప్పటికీ మార్కెట్లో ఉల్లి గరిష్ఠ ధర పలకటంతో రైతుల ముఖాలు ఆనందంతో వెలుగుతున్నాయి.
ఇదీ చదవండి: వినతులు ఇచ్చే వారికి... అధికారుల మర్యాదలు