ఎట్టేకేలకు కర్నూలు మార్కెట్లో ఉల్లి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సుమారు 2వేల5వందల క్వింటాళ్ల ఉల్లి మార్కెట్కు వచ్చింది. నాణ్యమైన క్వింటాలనకు గరిష్ఠంగా 8 వేల 5 వందల 90 రూపాయలకు కొనుగోలు చేశారు. సరాసరి ధర 5,800 రూపాయలు పలికింది. శనివారం గరిష్ఠ ధర 9,300 రూపాయలు పలికింది. ఆదివారం, సోమవారం మార్కెట్కు సెలవు కావటంతో విక్రయాలు జరగలేదు.
మహారాష్ట్ర నుంచి ఎక్కువగా దిగుబడులు వస్తున్నందున... షోలాపూర్, లాసెల్గావ్ మార్కెట్లలో... ధరలు క్రమంగా తగ్గుతున్నాయని... దాని ప్రభావం వల్లే కర్నూలు మార్కెట్ లో ధరలు దిగివస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి