కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని వెంకటగిరికి చెందిన ఉరుకుందు అనే వ్యక్తి రైల్వే ట్రాక్ మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. కేంద్ర స్కీం ఉందని, నెలకు లక్షకు ఐదు వేల రూపాయలు వడ్డీ వస్తుందని నమ్మించి బంధువుల వద్ద 47 లక్షల రూపాయలను వసూలు చేశాడు.
అతను మెుదట్లో మూడు నెలలు లక్షకు ఐదు వేల వడ్డీ చెల్లించటంతో అందరూ అతన్ని నమ్మారు. తర్వాత వడ్డీ చెల్లించకుండా అదిగో ఇదిగో అంటూ తిప్పుకున్నాడు. మోసపోయమని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.