కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం మదనంతపురం వద్ద ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన యువరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలైన బాధితులను అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొలిమిగుండ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి