కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం దేవిబెట్టలో విద్యుదాఘాతంతో వీరేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. పొట్టేలుని మేపేందుకు వెళ్లగా.. పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ కాలికి తగిలి మృతి చెందినట్లు గ్రామీణ ఎస్సై రామసుబ్బయ్య వివరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేసున్నట్లు వివరించారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఈనాడు - ఈటీవీ భారత్ కథనానికి స్పందన... ఉద్యోగుల సస్పెన్షన్