కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచికలపాడు వద్ద.. కర్నూలు- గూడూరు రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుు గుడిపాడు గ్రామానికి చెందిన మాలిగేపోగు శ్రీనివాసులుగా గుర్తించారు.
ఇదీ చదవండి: తితిదే మాజీ ప్రధానార్చకులు నారాయణ దీక్షితులు మృతి.. సీఎం సంతాపం