కర్నూలు జిల్లా సంజామల మండలం రామభద్రుడు పల్లె సమీపంలో ఆటో బోల్తా పడి నారాయణమ్మ (55 )అనే మహిళ మృతి(one died in auto accident) చెందింది. అదే ఆటోలో ప్రయాణిస్తున్న బన్నీ అనే బాలుడికి గాయాలయ్యాయి. ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ను దాటే క్రమంలో ఆటో ఊహించని విధంగా బోల్తాపడింది. దీంతో నారాయణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలునికి గాయాలయ్యాయి.
అలాగే అవుకు సమీపంలోని రిజర్వాయర్ మలుపు వద్ద ఆటో బోల్తా పడి కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన కుమారి, రాజమ్మ హిందూ, కార్తీక్ అనే పర్యాటకులకు తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లాకు జగ్గయ్యపేట చెందిన వీరు నంద్యాలకు రైల్లో వచ్చి అక్కడ బస చేసి బెలూం గుహలు చూసి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయాలైన బాధితులను బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు ఘటనలపై అవుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: