కర్నూలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వవిద్యార్థులు వారు చదువుకున్న కళాశాలకు తమవంతు సహాయం చేశారు. 1979-81 సంవత్సరంలో ఇంటర్ చదివిన కే.రవీందర్ రెడ్డి తమ కళాశాలకు ఏదైనా చేయాలని అధ్యాపకులను సంప్రదించగా.. విద్యార్థుల కోసం భవనం నిర్మించాలని సూచించారు. దీంతో ఆయన స్పందించి భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
రూ. 50 లక్షల నిధులతో విద్యార్థుల కోసం లెర్నింగ్ సెంటర్ నిర్మించారు. ఈ కేంద్రాన్ని నేడు ప్రారంభించి ప్రభుత్వానికి అంకితం చేశారు. అదే విధంగా 1980-82 పూర్వ విద్యార్థులు... కళాశాల ప్రధాన బిల్డింగ్‌ను 20 లక్షల రూపాయలతో ఆధునీకరించారు. ఈ సందర్భంగా పూర్వ విధ్యార్థులను కళాశాల అధ్యాపకులు అభినందించారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ!