కర్నూలులో కరోనా మృతుల అంత్యక్రియలకు నగర శివారులోని రింగ్ రోడ్డు వద్ద అధికారులు ఏర్పాటుచేశారు. ఈ ప్రాంతంలో శ్మశాన వాటిక ఏర్పాటు పై అక్కడ ఉన్న స్థానికులు అభ్యంతరం తెలిపారు. శ్మశాన వాటిక ఏర్పాటు చేసిన ప్రాంతంలో ప్రజానగర్, ఏపీ టిడ్కో హౌసింగ్ ఇళ్లు, రాగమమురి కాలనీ ఉన్నాయని... జనవాసాలు ఉన్న ప్రాంతంలో కరోనా మృతులను పూడ్చడం ఏంటని స్థానికులు అంటున్నారు. కొండ ప్రాంతంలో శవాలను పూడ్చటానికి 15 అడుగుల గుంతను ఎలా తీస్తారని స్థానికులు అధికారులను ప్రశ్నించారు.
ఇవీ చదవండి...అభినవ గోపన్న... తీర్చాడు గోవుల ఆకలి