నర్సింగ్ విద్యార్థుల నిరసన కర్నూలు జిల్లాలో రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి రాజ్ విహార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే నర్సింగ్ అధికారలకు 20 వేల గౌరవ వేతనం ఇవ్వాలన్నారు.