కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో తెదేపా నాయకులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా మెగా రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేశారు.
కర్నూలు
తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 25వ వర్థంతిని పురస్కరించుకొని కర్నూలులో కార్యకర్తలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. జిల్లా తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల కోసం ఎంతో చేసిన ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని కర్నూలు నియెజకవర్గ తెదేపా సభ్యుడు టీజీ. భరత్ కోరారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెడతామని హమీ ఇచ్చిన వైకాపా నాయకులు మాట నిలబెట్టుకోవాలన్నారు.
ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరులో మహనాయకుడు, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే ఉచిత రక్తదాన శిబిరం చేపట్టగా.. మాజీ ఎమ్మెల్యేలతో పాటు, తెదేపా నాయకులు , కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు.
ఆలూరు
తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఆలూరులో కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో వాసవి కల్యాణ మండపంలో లెజండరీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
ఇదీ చదవండీ..