కర్నూలు జిల్లా ఆదోని నెహ్రూ స్మారక పురపాలక ఉన్నత పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు దర్శనమిస్తోంది. 60 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆంగ్ల, తెలుగు మాధ్యమల్లో బోధిస్తున్నారు . విలువలతో కూడిన మెరుగైన విద్య, బోధన ఉత్తమ ఫలితాలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించాయి. ఈ కారణంగా పాఠశాలకు భారీగా డిమాండ్ పెరిగింది. పాఠశాల ప్రారంభమైన కొన్ని రోజులకే సీట్లు అయిపోవటంతో.... ప్రవేశాలు లేవని బోర్డు పెట్టేశారు.
అదనపు గదులు కావాలి...
పాఠశాలలో ప్రస్తుతం 15వందల 56 మంది విద్యార్థులు ఉండగా, వీరిలో 470 మంది ఈ ఏడాది కొత్తగా చేరటం గమనార్హం. గత ఏడాది 22 మంది విద్యార్థులు 9 పాయింట్లను సాధించారని ప్రధానోపాధ్యాయుడు రామయ్య తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో చేరికలను దృష్టిలో ఉంచుకుని అదనపు తరగతి గదులను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.