కర్నూలు జిల్లా నందికొట్కూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ డే నిర్వహించారు. విద్యార్థులు భూగోళశాస్త్రం, వ్యవసాయంపై చేసిన పరిశోధనలు ఆలోచింపజేశాయి. చిన్నారులు రూపొందించిన కుట్టు, అల్లికలు, టోపీలు, గృహాలంకరణకు సంబంధించిన వస్త్రాల వస్తువులు ఆకర్షణగా నిలిచాయి. ఇలాంటి ప్రదర్శన వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత బయటపడుతుందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పుష్పలత అన్నారు.
ఇదీ చదవండి: