కర్నూలు జిల్లా వ్యాప్తంగా నాగుల చవితిని ఘనంగా నిర్వహిస్తున్నారు. నేటితో ప్రారంభమైన పండుగ ఈ నెలంతా కొనసాగనుంది. కర్నూల్లోని దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. బుధవారపేటలోని నీలకంటేశ్వరస్వామి దేవాలయంలో ఉన్న నాగుల కట్టకు మహిళలు పెద్ద ఎత్తున పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
నంద్యాలలోని పలు ఆలయాల ఆవరణల్లో వెలసిన నాగుల కట్టల వద్ద భక్తులు భారులు తీరారు. నాగుల విగ్రహాలకు పాలాభిషేకాలు చేసి నైవేద్యం సమర్పించారు. పత్తికొండ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో వెలసిన పుట్టల్లో పాలు పోసి... కొత్తగా పెళ్లయిన జంటలు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి శ్రద్ధలతో దంపతులు, పిల్లలు నాగేంద్రున్ని దర్శించుకున్నారు. నందికొట్టుకూరు నియోజకవర్గం వ్యాప్తంగా పలు ఆలయాల్లోని నాగుల కట్టల్లో... భక్తులు పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. డోన్ లో నాగులచవితి పండుగ ఘనంగా చేశారు. పుట్టలు, నాగులప్ప విగ్రహాలకు పూజలు చేసేందుకు జనం బారులు తీరారు.
ఇవీ చూడండి-ట్రెండ్ మారినా...ఫ్రెండ్ మారడు!