కర్నూలు జిల్లా బేతెంచేర్ల మండలంలోని మద్దిలేటి స్వామి ఆలయం సమీపంలో హత్య చోటు చేసుకుంది. ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన మధు, ప్రతి రోజు తన హోటల్ నిర్వహాణలో భాగంగా మద్దిలేటి స్వామి ఆలయం వైపు వెళ్తుండే వాడు. ప్రతి రోజు మాదిరే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మధు తలపై రాడ్తో కొట్టి పరారయ్యారు. దీంతో మధు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: అమానుషం: మతం మారినందుకు చిత్రహింసలు