పురపాలిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సర్వం సిద్ధం చేశారు. అత్యధిక ఓటర్లున్న కర్నూలు నగరపాలక సంస్థ, నంద్యాల, ఆదోని పురపాలక సంఘాల్లో ఫలితాలు మిగిలిన వాటితో పోల్చితే కొంత జాప్యమయ్యే అవకాశం ఉంది. కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో, సెయింట్ జోసఫ్ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల, పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలల్లో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
జిల్లా వ్యాప్తంగా పురపాలికల వార్డుల వారీగా వివరాలు:
పురపాలక | మొత్తం వార్డులు | ఏకగ్రీవం జరిగిన వార్డులు | ఎన్నికలు జరిగిన వార్డులు |
కర్నూలు | 52 | 02 | 50 |
నంద్యాల | 42 | 12 | 30 |
ఆదోని | 42 | 09 | 33 |
ఎమ్మిగనూరు | 34 | 02 | 32 |
డోన్ | 32 | 25 | 07 |
ఆత్మకూరు | 24 | 15 | 09 |
ఆళ్లగడ్డ | 27 | 08 | 19 |
నందికొట్కూరు | 29 | 04 | 25 |
గూడూరు | 20 | 00 | 20 |
మొత్తం | 302 | 77 | 225 |
ఓట్ల లెక్కింపు జరగనున్న కేంద్రాలు..
కర్నూలు నగర పాలక సంస్థ పరిదిలో 52 వార్డులు ఉండగా రెండు వార్డులు ఏకగ్రీవం కావడంతో 50 వార్డుల్లో ఎన్నికలు కొనసాగాయి. 50 వార్డులకు సంబంధించి నగర సమీపంలోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో 12 వార్డులు, జి. పుల్లయ్య కళాశాలలో 22 వార్డులు, సెయింట్ జోసెఫ్ జూనియర్, డిగ్రీ కళాశాలలో 16 వార్డుల ఓట్ల లెక్కింపు జరగనుంది. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలు నిర్వహించరాదని పోలీసులు తెలిపారు. అభ్యర్థులకు కర్నూలు రెండో పట్టణ పోలీసు స్టేషన్లో కౌంటింగ్ సందర్భంగా నియమనిబంధనలపై అవగాహన కల్పించారు.
ఆదోని- ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, నంద్యాలలోని- ఈఎస్‌జీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎమ్మిగనూరులోని- జవహర్ నవోదయ విద్యాలయం, డోన్‌లోని- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆళ్లగడ్డలోని- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మున్సిపాలిటీల లెక్కింపు చేపట్టనున్నారు. డోన్ లో 32 వార్టులకు గాను 25 వైకాపా ఏకగ్రీవం కావడంతో ఛైర్మన్ పీఠం వైకాపాకు దక్కింది.
ఆత్మకూరు, నందికొట్కూరు, గూడూరు మున్సిపాలిటీలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కర్నూలులోనే జరగనుంది. ఈ మూడింటికి రాయలసీమ విశ్వవిద్యాలయంలో కొన్ని బ్లాకులు కేటాయించారు. నందికొట్కూరు పురపాలక ఓట్ల లెక్కింపు స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సు భవనంలో, గూడూరుకు అకడమిక్ బ్లాక్-2లో, ఆత్మకూరుకు వర్సిటీలో ప్రత్యేకంగా కేటాయించారు. ఆత్మకూరులో 24 వార్డుల్లో 15 వైకాపా ఏకగ్రీవం చేసుకుని.. పీఠాన్ని అధికారపార్టీ దక్కించుకుంది.
ఇదీ చదవండి: