కర్నూలులో నగర పాలక సంస్థ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు 48.87 పోలింగ్ శాతం నమోదైంది. 43వ వార్డులో ఓట్లు వేసిన వారి వివరాలను అధికారులు.. వైకాపా వారికి చెబుతున్నారని తెదేపా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల వారిని పోలింగ్ కేంద్రం నుంచి పోలీసులు పంపివేశారు. పాణ్యం తెదేపా నాయకులు గౌరు వెంకట రెడ్డి దంపతులు, కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్. సంజీవ్ కుమార్, తెదేపా నేత టీజీ. భరత్ దంపతులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇదీ చదవండి: