Sribag Agreement Day: శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేస్తూ.... రాయలసీమలో హైకోర్టును ఏర్పాటుచేయాలంటూ... పలుచోట్ల ర్యాలీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన వికేంద్రీకరణ సభకు... ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. రాజధానిని నచ్చిన చోట ఏర్పాటుచేసుకోవచ్చని... ప్రధాని మోదీ, సీఎం జగన్‌కు చెప్పారని.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. త్వరలోనే మూడు రాజధానులు ఏర్పాటుచేస్తామన్నారు.
శాసన రాజధానిగా అమరావతికి తాము వ్యతిరేకం కాదని.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతిలో నిర్వహించిన శ్రీబాగ్ ఒప్పంద దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అమరావతి రైతుల కంటే... రాయలసీమ ప్రజలు చేసిన త్యాగాలే గొప్పవన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో.. వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రాజధానులకే మద్దతు కార్యక్రమం కోసం పోలీసులు.. వాహనాలను మళ్లించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ రాజధానిగా కర్నూలే ఉండాలంటూ.. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని టవర్ క్లాక్ వద్ద వైకాపా ఆధ్వర్యంలో విద్యార్థులు మాహనహారం చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైకాపా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యమని.. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ... వామపక్షాల నేతలు... కడపలో ర్యాలీ చేపట్టారు.