గత ప్రభుత్వంలో అక్రమంగా ఐదేళ్లు మైనింగ్ చేసి ఇప్పుడు తమపై నిందలు మోపుతున్నారని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కర్నూలులో ఆరోపించారు. అక్రమ మైనింగ్ చేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జుబేర్ వాగును ఆక్రమించుకుని తిరిగి ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని దుయ్యబట్టారు. వాగుపై అక్రమ కట్టడాలను కొలతల ద్వారా నిరూపిస్తామని సవాల్ చేశారు.
ఇవీ చూడండి...