కర్నూలు జిల్లా ఆదోనిలో మంత్రులు ఆళ్ల నాని, జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పర్యటించారు. పట్టణంలో నిర్మించే వైద్య కళాశాల కోసం మూడు చోట్ల స్థలాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మంత్రులు స్థల పరిశీలన చేశారని.. 50 ఎకరాల్లో రూ.400 కోట్లతో వైద్య కళాశాల నిర్మించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్, ఆర్డీవో బాల గానేషయ్య ,రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి..