కర్నూలు జిల్లాలో చెదురుముదురు ఘటనలు మినహా నాలుగోవిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదోని రెవెన్యూ డివిజన్ , పశ్చిమ ప్రాంతంలో కోసిగి, ఎమ్మిగనూరు మండలాల్లో ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు వలస కూలీలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వేలాది మంది కూలీలు ఓట్ల కోసం ..సొంత ఊర్లకు తిరిగివచ్చారు. పంచాయతీ ఫలితాలు వెలువడక ముందే పలువురు వలస కూలీలు ప్రకాశం, గుంటూరు, తెలంగాణ రాష్ట్రానికి తిరుగు ప్రయాణం అయ్యారు.
- మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీమద్దతుదారులను వేకువజామునే అరెస్టు చేసి తీసుకువెళ్లటంతో ఆ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు.
- కోసిగి మండల కేంద్రంలో భారీగా దొంగఓట్లు వేస్తున్నారని... తమకుఓటు హక్కు లేకుండా చేశారని... ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.మరో ప్రాంతంలో ఓటర్ స్లిప్ ఉన్నా..ఎవరో ఓటేశారు.
- పెద్దకడుబూరు మండలం హనుమాపురంలో ఇందిరమ్మ 10 ఓట్లతో గెలుపొందారు. రీ కౌంటింగ్ చేయాలని మరోవర్గం పట్టుబట్టడంతో వాగ్వాదం నెలకొంది.
- పెద్దకడుబూరులో ఓట్లు అభ్యర్థిస్తున్నారని... ఓ వర్గంపై మరో వర్గం ఆందోళనకు దిగింది. ఆదోని మండలంలోని కప్పటిగ్రామంలో దొంగఓటు వేయటానికి వచ్చిన యువకుడిని ఓ వర్గం అడ్డుకోవటంతో వాగ్వాదం జరిగింది.
- హాలహర్వి మండలం నిట్రవటి గ్రామంలో ఓటమిని భరించలేని అభ్యర్థి.. వర్గీయులు రాళ్లదాడికి దిగారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. హాలహర్వి మండలం బేవినహాల్ లో జయశ్రీ 2 ఓట్లతో, బాపురంలో భాగ్యలక్ష్మి 8 ఓట్లతో,గోనెగండ్ల మండలం ఎర్రబాదులో అరుణ 6 ఓట్లతో గెలుపొందారు
ఇదీ చూడండి.