ETV Bharat / state

హోలీ ప్రత్యేకం.. ఇక్కడ మగాళ్లు.. మగువల్లా సింగారించుకుంటారు - ఆదోనిలో చీరలకు కట్టుకున్న పరుషులు న్యూస్

హోలీ అంటే.. కాముని దహనం, రంగులు చల్లుకోవడం.. ఇదే కదా..! కానీ అక్కడ మాత్రం ప్రత్యేకం. ఓ వింతైన ఆచారం కొనసాగుతోంది. హోలీ వచ్చిందంటే చాలు.. జంబలకిడిపంబ తరహాలో మగాళ్లు ఆడవాళ్లైపోతారు. తమ కోరికలు నెరవేరేందుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంతకీ అది ఎక్కడంటే..?

హోలీ ప్రత్యేకం.. ఇక్కడ మగాళ్లు.. మగువల్లా సింగారించుకుంటారు

author img

By

Published : Mar 28, 2021, 5:50 PM IST

హోలీ ప్రత్యేకం.. ఇక్కడ మగాళ్లు.. మగువల్లా సింగారించుకుంటారు

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లుర్ గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే.. జంబలకిడిపంబ సినిమా తరహాలో వింత ఆచారం కొనసాగుతోంది. తరతరాల నుంచి ఓ సంప్రదాయం నడుస్తోంది. మగాళ్లు హోలీ రోజున చీరలు కట్టుకుని.. మహిళ్లలా సింగారించుకుంటారు. రతి మన్మథుడికి పూజలు చేస్తారు.

హోలీ రోజున సంతెకుడ్లుర్ గ్రామంలో మగాళ్లంతా.. చీరలు కట్టుకుని, నగలు, పూలు సింగారించుకొని అలంకరణ చేసుకుంటారు. హోలీ సందర్భంగా తమ గ్రామంలో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఇలా చేస్తారు. ఇక్కడికి కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా చాలామంది వస్తారు. పురుషులు ఆడవాళ్ల మాదిరిగా వేషధారణ చేసుకుని పూజిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని వారి నమ్మకం.

ఇలా పూజించడం వల్ల పంటలు బాగా పండుతాయని, గ్రామానికి కష్టాలు రాకుండా ఉంటాయని.. ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉంటాయని అక్కడి వారి నమ్మకం. ప్రతి ఏటా.. హోలీ పండుగకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ వింత ఆచారాన్ని చూడడానికి భారీ ఎత్తున తరలివస్తారు. అదన్న మాట మగ మహారాణుల విషయం.

ఇదీ చదవండి: గజరాజు వీరంగం- వ్యక్తి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.