ETV Bharat / state

నంద్యాలలో ఇరవై ఒక రూపాయలకే కాటన్ చీర - నంద్యాలలో తక్కువ ధరకే చీర

మహిళలకు చీరలంటే ఎంతో ప్రాణం... డిస్కౌంట్​ ఇస్తున్నారంటే ఎంత దూరమైనా వెళ్తారు... వారికి ఎన్ని చీరలు ఉన్నా.. ఆఫర్లు ఉంటే మరిన్నీ చీరలు కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. 10శాతం, 20 శాతం డిస్కౌంట్​ ఇస్తేనే.. రెండు, మూడు చీరలు కొనాలనుకుంటారు. అలాంటిది రూ.21కే చీర ఇస్తామంటే మహిళలు ఆగుతారా... అందుకే ఆ షాపు దగ్గరకు భారీ ఎత్తున తరలివచ్చారు.

బారులు తీరిన జనం
బారులు తీరిన జనం
author img

By

Published : Apr 8, 2021, 9:47 AM IST

Updated : Apr 8, 2021, 12:45 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలోని వీరభద్ర షాపింగ్​మాల్​ వారు 21 రూపాయికే చీర అని ప్రకటించారు. ఆఫర్​ విషయం తెలుసుకుని ఉదయం నుంచే మహిళలు భారీ ఎత్తున షాపు దగ్గరకు చేరుకున్నారు. కరోనా వేళ పరిస్థితి అదుపు తప్పి ట్రాఫిక్​ స్తంభించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

పోలీసుల జోక్యంతో యాజమాన్యం ఆఫర్​ లేదని ప్రకటించింది. దీంతో మహిళలంతా భారీ ఆఫర్​ పోయిందే అనుకుంటూ వెనుదిరిగారు.

ఇదీ చదవండీ.. పురుషుడికి వితంతు పింఛన్ .. ఏళ్లు గడిస్తే కానీ గుర్తించని అధికారులు

Last Updated : Apr 8, 2021, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.