ETV Bharat / state

'మేమేం పాపం చేశాం.. న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే'

Medically Unfit Employees in RTC: వారంతా ఎన్నో ఏళ్లు ఆర్టీసీకి విలువైన సేవలు అందించారు. ఎంతో మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. కానీ విధి వక్రీకరించి ప్రమాదంలో అవయవాలను కోల్పోయారు. అప్పటి నుంచి తమ వారసులకైనా సంస్థ ఉద్యోగాలు ఇస్తుందని ఎదురుచూశారు. కానీ వారి ఆశల మీద ఆర్టీసీ నీళ్లు చల్లింది. మెడికల్ అన్ ఫిట్ అయిన వారి వారసులకు ఉద్యోగాలిచ్చేది లేదని తేల్చిచెప్పడంతో.. న్యాయం కోసం వారంతా రోడ్డెక్కారు.

Medically Unfit Employees in RTC
Medically Unfit Employees in RTC
author img

By

Published : Feb 27, 2022, 4:59 PM IST

Medically Unfit Employees in RTC: 'మేమేం పాపం చేశాం.. న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే'

Medically Unfit Employees in RTC: వీడియోలో కన్నీళ్లతో దీనావస్తను చెప్పుకుంటున్న ఈమె పేరు ప్రభావతమ్మ. భర్త కర్నూలు జిల్లా డోన్ డిపోలో ఆర్టీసీ కండక్టర్. విధి నిర్వహణలో తీవ్రగాయాలపాలై చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. అప్పటి నుంచి తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ యాజమాన్యం చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యోగం ఇచ్చేదిలేదని ఆర్టీసీ తేల్చి చెప్పడంతో.. ఇలా కన్నీరు పెడుతూ న్యాయం కోసం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నారు.

ఈ విధంగా ఓ డ్రైవర్, మరో కండక్టర్ ఇలా చాలా మంది విధి నిర్వహణలో ప్రమాదానికి గురయ్యారు. వీరిని మెడికల్ అన్‌ఫిట్‌గా ఆర్టీసీ నిర్థరించింది. అప్పటి నుంచి తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని సంస్థ ప్రధాన కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ.. కొలువు రాలేదు. ఇటీవల సర్కులర్ జారీ చేసిన ఆర్టీసీ.. 2020కి ముందు మెడికల్ అన్‌ఫిట్ అయిన వారికి ఉద్యోగాలిచ్చేది లేదని.. మానిటరీ బెనిఫిట్స్ మాత్రమే ఇస్తామని తేల్చిచెప్పింది. గత్యంతరం లేక న్యాయం కోసం విజయవాడలో ధర్నా చేస్తున్నారు.

ఇది కేవలం ఒక్కరిద్దరి ఆవేదనే కాదు. ఇక్కడ దీనంగా కనిపిస్తున్న ఎవరిని కదిపినా.. అంతులేని వేదనే. జీవనాధారం లేక తమ వారసులకు సంస్థ ఇచ్చే ఉద్యోగంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ.. వీరి మొర ఎవ్వరూ ఆలకించలేదు. 2020 తర్వాత మెడికల్ అన్‌ఫిట్ అయిన వారికి మాత్రమే ఉద్యోగాలిస్తామని ఇటీవలే కిందట ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ వార్త విన్న వీరంతా హతాశులయ్యారు. తామేం పాపం చేశామంటూ 175 మంది బాధితులు రోడ్డెక్కారు.

విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చే నిబంధన ఆర్టీసీలో ఎప్పటి నుంచో ఉంది. 2015 తర్వాత వీటిని పెండింగ్‌లో పెట్టింది. ప్రభుత్వంలో విలీనమయ్యాక 2020 తర్వాత మెడికల్ అన్‌ఫిట్ అయిన వారి వారసులకు మాత్రమే ఉద్యోగాలిస్తామని.. అంతకుముందు వారికి ఇవ్వలేమని తేల్చిచెప్పింది. వారసులకు ఉద్యోగాలు వస్తాయని ఆశించిన వీరంతా ఆర్టీసీ నిర్ణయంతో ఒక్కసారిగా హతాశులయ్యారు. ఎలా బతుకీడవాలో అర్థం కావడం లేదని.. న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు.

ఇదీ చదవండి

కక్ష సాధింపులు బాక్సాఫీస్‌ వద్ద ఎందుకు..? ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.