కర్నూలు జిల్లా నందికొట్కూరులో గృహిణి సునిత.. అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునితకు 9 ఏళ్ల కిందట రాజు అనే వ్యక్తితో వివాహమైంది. ఆ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు. ఈ కారణంగా భర్త వేరే పెళ్లి చేసుకుంటానని ఏడాది నుంచి సునితను ఇబ్బంది పెడుతున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో వేరే మహిళతో రాజు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. విషయం తెలుకున్న సునిత... మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి