ఆదోనిలో హత్యకు గురైన ఆడమ్ స్మిత్ కుటుంబసభ్యులను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. నందవరం మండలంలోని గురుజాలలో ఆడమ్ తల్లిదండ్రులు, భార్యతో మాట్లాడారు. మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ నిఘా వైఫల్యం కారణంగా ఈ దారుణం జరిగిందన్నారు.
బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు వంద రోజుల్లో కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. శిక్షలు కఠినంగా ఉంటే.. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయన్నారు. అనంతపురంలో స్నేహలత కేసులో ఐదు ఎకరాల భూమి ఇచ్చినట్టే... ఇక్కడా బాధిత కుటుంబానికి అందించాలని కోరారు.
ఇదీ చదవండి: ఆదోనిలో పట్టపగలే తలపై బండరాయితో మోది దళిత యువకుడి హత్య