ETV Bharat / state

భార్యపై అనుమానం.. వివాహమైన నెలన్నరకే వరుడు ఆత్మహత్య

భార్యపై అనుమానం పెనభూతంలా మారి ప్రాణాలను తీసుకుంది. కర్నూలు జిల్లా మల్కాపురంలో పెళ్లైన నెలన్నరకై ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

man commited suicide at karnool on doubt on wife
భార్యపై అనుమానం.. వివాహమైన నెలన్నరకే వరుడు ఆత్మహత్య
author img

By

Published : Sep 14, 2020, 12:41 PM IST

ఆ యువకుడికి భార్యపై వచ్చిన అనుమానం పెనుభూతంగా మారింది. వివాహమైన నెలన్నరకే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా మల్కాపురానికి చెందిన వెంకటేశ్వర్లు, పార్వతమ్మలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నాగరాజు(29) ఆదోని మండలం నారాయణపురంలోని సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పెద్దల సమక్షంలో నాగరాజు, కడిమెట్లకు చెందిన కేశవలక్ష్మితో ఆగస్టులో వివాహం జరిగింది. 15 రోజులకే భార్యపై అనుమానం పెంచుకున్నారు. ఇద్దరూ దూరంగా ఉంటూ వచ్చారు. 12 రోజుల కిందట భార్య పుట్టింటికి వెళ్లింది.

ఈక్రమంలో శనివారం పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. భార్యను తీసుకెళ్లాలని పెద్దలు సూచించారు. కాగా శనివారం రాత్రి ఎమ్మిగనూరులోని గాంధీనగర్‌లో నాగరాజు తన మిత్రుల గదిలో ఉండి రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మిత్రులు ఆదివారం ఉదయం లేచి వేళాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై వెల్లడించారు.

ఇదీ చదవండి: అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.