ETV Bharat / offbeat

వింటర్​ స్పెషల్​ - ఘుమఘుమలాడే "కళ్యాణ రసం" - ఇలా చేస్తే తినడమే కాదు డైరెక్ట్​గా తాగేస్తారు కూడా! - HOW TO MAKE KALYANA RASAM AT HOME

-చలికాలం వేడివేడిగా గొంతులోకి జారుతుంటే ఆ ఫీలింగ్​ వేరే లెవల్​ -ఎంతో ఈజీగా కేవలం నిమిషాల్లో ప్రిపేర్​ చేసుకోవచ్చు

Tamil Nadu Wedding Style Kalyana Rasam
Tamil Nadu Wedding Style Kalyana Rasam (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2024, 4:13 PM IST

Tamil Nadu Wedding Style Kalyana Rasam: చలికాలం వచ్చేసింది. ఈ క్రమంలో చాలా మంది చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా తినే విషయంలో వేడివేడి కూరలు, రసాలు, సూప్​లు వంటివన్నీ ఉండేలా చేసుకుంటుంటారు. తాజాగా అలాంటి వారి కోసం అద్దిరిపోయే రెసిపీ తీసుకొచ్చాం. అదే తమిళనాడు వెడ్డింగ్​ స్టైల్​ "కళ్యాణ రసం. చాలా టేస్టీగా ఉండే దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా అన్నంలో కలుపుకుని తింటారు. కేవలం తినడమే కాదు ఏకంగా తాగొచ్చు కూడా. పైగా ఈ రసాన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ టేస్టీ కళ్యాణ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలేంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • ఆవాలు - 1 టీస్పూన్​
  • పసుపు - ముప్పావు టీ స్పూన్​
  • ఎండు మిర్చి - 4
  • టమాట - 1(పెద్దది)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఉడికించిన కందిపప్పు - 100 గ్రాములు
  • నీళ్లు - 250ml
  • చింతపండు - 100 గ్రాములు
  • కరివేపాకు -4 రెమ్మలు
  • మిరియాలు - 1 టీస్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 8
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • ఇంగువు - పావు టీ స్పూన్​

తయారీ విధానం:

  • ముందుగా ఓ పెద్ద సైజ్​ టమాట తీసుకుని కడిగి ముక్కలు కట్​ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత మిరియాలు, వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి తీసుకోవాలి.
  • అలాగే కందిపప్పును శుభ్రంగా కడిగి ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. చింతపండను నానబెట్టి గుజ్జు తీసి అందులో 400 ml నీళ్లు పోసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడించాలి.
  • ఆ తర్వాత పసుపు, ఎండుమిర్చి ముక్కలు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత కట్​ చేసిన టమాట ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్​ను సిమ్​లో పెట్టి ఓ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే ఆ ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి.
  • టమాటలు మెత్తగా అయ్యాక ఉడికించుకున్న పప్పు వేసి బాగా కలిపి పావు లీటర్​ నీళ్లు పోసి పప్పను మెదుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్​ మీద ఓ పొంగు వచ్చే వరకు మరిగించాలి.
  • రసం మరుగుతున్నప్పుడు చింతపండు రసాన్ని పోసి కలుపుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును కాడలతో సహా వేసి దంచిన మిరియాలు, వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి ఆ తర్వాత కొత్తిమీర తరుగు వేసి కదపకుండా మీడియం ఫ్లేమ్​ మీద ఓ పొంగు వచ్చేవరకు మరిగించుకోవాలి.
  • ఆ తర్వాత ఇంగువ వేసి మరో నిమిషం పాటు మరిగించి దింపేసుకుంటే చాలు. ఘుమఘుమలాడే తమిళనాడు పెళ్లిళ్ల స్పెషల్​ కళ్యాణ రసం రెడీ. దీన్ని వేడివేడిగా తిన్నా, చల్లారిన తర్వాత తిన్నా టేస్ట్​ అద్దిరిపోతుంది.
  • నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి..

వర్షాకాలంలో "పచ్చి పులుసు" ఇలా చేస్తే - టేస్ట్​ గురించి చెప్పడం కాదు, ఆస్వాదించాల్సిందే!

చిటపట చినుకుల వేళ స్పైసీ స్పైసీ "పుదీనా చారు"- ఇలా ప్రిపేర్​ చేస్తే తినడమే కాదు తాగొచ్చు కూడా!

నిమిషాల్లో ప్రిపేర్​ అయ్యే 'పెసరపప్పు చారు'- ఇలా చేస్తే టేస్ట్​ నెక్ట్స్​ లెవల్​ అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.