ETV Bharat / state

వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు - VASIREDDY COMPLAINT ON GORANTLA

వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఏపీ మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు.

vasireddy_padma_complaint_on_ysrcp_ex_mp_gorantla_madhav
vasireddy_padma_complaint_on_ysrcp_ex_mp_gorantla_madhav (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2024, 4:50 PM IST

Vasireddy Padma Complaint on YSRCP Ex MP Gorantla Madhav : అత్యాచార బాధితుల పట్ల వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ మాజీ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. రేప్ బాధితుల వివరాలు గోరంట్ల మాధవ్ బహిర్గతం చేయటంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితులను పట్ల దుర్మార్గంగా మాట్లాడిన గోరంట్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరామన్నారు.

గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ వాళ్ల పార్టీకి చెందిన వార్తా ఛానెల్ ప్రసారం చేయటాన్ని కూడా ఫిర్యాదులో ప్రస్తావించామన్నారు. గోరంట్ల మాధవ్ పైన సైబర్ క్రైమ్ వారికి కూడా ఫిర్యాదు చేశానని పద్మ పేర్కొన్నారు. అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించడం దుర్మార్గమని, వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తనకు ఆప్తులు అని చెప్పారు. వాసిరెడ్డి పద్మ ఇటీవల వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆమె వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వారంలో రోజుల్లో రాజకీయపరమైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరేది మరో వారం రోజుల్లో ప్రకటిస్తానని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

'జగన్​కు బాధ్యత లేదు - గుడ్ బుక్​ కాదు గుండె బుక్ ఉండాలి' - వైఎస్సార్సీపీకి రాజీనామా

'అత్యాచారానికి గురైన బాధితుల పట్ల ఏ మాత్రం మానవత్వం లేకుండా, తానొక మాజీ ఎంపీని అని మర్చిపోయి గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు అమానవీయం. బహిరంగంగా రేప్​ బాధితులు,​ నేరస్తుల పేర్లు చెప్పడం చాలా పెద్ద నేరం. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుతోవాలి. అత్యాచార బాధితుల పట్ల గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు విస్తుగొలిపేలా ఉన్నాయి. అత్యాచారాలకు గురైన వారి వివరాలు గొప్యంగా ఉంచుతాము. కానీ ఏ మాత్రం అవగాహన లేకుండా అత్యాచారానికి గురైన బాధితుల పేర్లను గోరంట్ల మాధవ్ నిస్సిగ్గుగా బయటకు చెప్పారు.' -వాసిరెడ్డి పద్మ, మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.