RCM Primary School: అది 15 అడుగుల వెడల్పు.. 30 అడుగుల పొడవున్న తరగతి గది. అందులోనే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బియ్యం బస్తాలు, వంట సామగ్రి, నీటి ట్యాంకు, పుస్తకాలు, క్రీడా సామగ్రి ఉంటాయి. వీటన్నింటికీ పోగా మిగిలిన ఆ కాస్త స్థలంలో ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి. పైగా అన్ని తరగతులకు ఉన్నది ఒకే ఉపాధ్యాయుడు. ఇది కర్నూలు జిల్లా ఆలూరు మండలం హుళేబీడు గ్రామంలోని ఆర్‌సీఎం ప్రాథమిక పాఠశాలలో బోధనావస్థ. ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు మొత్తం 114 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో రోజూ 90 నుంచి 100శాతం మంది హాజరవుతారు. వీరందరిని ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు బోధించాల్సి వస్తోంది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది.
ఇదీ చదవండి: 'ఈ ఏడాది బహిరంగ అప్పు రూ.45,500 కోట్లు'