కర్నూలు జిల్లా నందికొట్కూరు పురప్రజలకు శాశ్వత నీటి పరిష్కారానికి రూ రూ.109.18 కోట్ల వ్యయంతో మంచినీటి పథకానికి నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందారెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ భూమిపూజ చేశారు. దశాబ్దాల కాలం నుంచి నందికొట్కూరు పట్టణ ప్రజలు తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిధులు మంజూరయ్యాయి. కొత్తగా పాలన చేపట్టిన వైకాపా ప్రభుత్వం నిధులను నిలిపివేసింది. మళ్లీ వాటిని విడుదల చేయడంతో...పనులు చేపట్టనున్నారు.
ఇదీ చూడండి. చికిత్స పొందుతూ... విచారణలో పాల్గొన్న ఏఏజీ..!