ETV Bharat / state

ఇళ్ల స్థలాల జాబితాలో పేర్లు లేవు.. లబోదిబోమంటున్న అర్హులు

author img

By

Published : Jul 7, 2020, 9:14 AM IST

పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల పట్టాల పంపిణీ ఈ నెల 8 నుంచి ఆగస్టు 15వ తేదీకి వాయిదా పడింది. కాగా, ఇప్పటికే క్షేత్రస్థాయిలో వాలంటీర్లు అర్హులను గుర్తించి జాబితాను సిద్ధం చేశారు. అయితే మొదటి జాబితాలో గుర్తించిన నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతోంది. తుది జాబితాను రూపొందించినా కొందరు నిజమైన అర్హులపై వేటు పడింది. అర్హులకు అన్యాయం జరిగిందని లబోదిబోమంటున్నారు.

land distribution
land distribution

చిత్ర విచిత్రాలు..

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియలో భాగంగా లబ్ధిదారుల ఎంపికలో చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. వేలాది మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం అర్జీలు సమర్పించారు. లాక్‌డౌన్‌కు మందు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. తమకు ఇళ్ల స్థలాలు వస్తున్నాయని ఆనందపడిన పేదలకు లాక్‌డౌన్‌ తర్వాత రెండో జాబితాలో తమ పేర్లు లేవు. మొదట అర్హులమని వాలంటీర్లు చెప్పారని, ఇప్పుడు అనర్హులుగా చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

25 వేల మంది ఎంపిక..

కర్నూలు నగర పరిధిలో 133 సచివాలయాలు ఉన్నాయి. వాటి ద్వారా వాలంటీర్లచే అర్హులను గుర్తించారు. మొత్తం 25 వేల మందిని ఎంపిక చేశారు. వీరందరికి కర్నూలు మండలం పసుపల సమీపంలోని రుద్రవరంలో 380 ఎకరాల స్థలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. వాలంటీర్లు అర్హుల వద్ద ఫొటోలు, ఆధార్‌ కార్డు, ఓటరు కార్డు, రేషన్‌ కార్డు తదితర పత్రాలను సేకరిస్తున్నారు. అధికారులు సర్వే నెంబరు, ప్లాట్‌ నెంబర్లు తదితర వాటిని పత్రాల్లో పూరించే పనుల్లో నిమగ్నమయ్యారు.

వాలంటీర్ల సంతకాలు..

కొంతమంది సొంతిళ్లు ఉన్నా స్థలాల కోసం ప్రజాప్రతినిధుల సిఫార్సులతో వాలంటీర్ల ఐడీ నెంబర్లు, సంతకాలతో దరఖాస్తులను పూరించి వాటిని నగరపాలక సంస్థలో ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తున్నారనే విమర్శలున్నాయి. నిజమైన అర్హులకు ఇళ్ల స్థలాల జాబితాలో పేర్లు రాలేదు. వారు ఎవరికి చెప్పుకోవాలలో అర్థం కాని పరిస్థితి. వాలంటీర్లు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఓ గ్రామానికి ఎక్కువ.. మరో గ్రామానికి తక్కువ..

గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొన్ని గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులను గుర్తించగా అందుకు తగినట్లుగా పత్రాలు రాలేదు. మరికొన్ని గ్రామాల్లో గుర్తించిన లబ్ధిదారుల కంటే ఇళ్ల పత్రాలు అధికంగా వచ్చాయి. ఈ క్రమంలో గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై అనర్హుల పేర్లను జాబితాలో నమోదు చేయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

వాలంటీర్‌ గడప తొక్కలేదు..

30 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే నివాసముంటున్నా... సొంత ఇంటి కల నెరవేరుతుందని ఎంతో ఎదురుచూడటంతోనే సరిపోతుంది. ఈసారి ఇంటి స్థలం వస్తుందని భావించినా నా ఆశ ఆవిరైపోయింది. మేమున్న ఇంటికి వాలంటీరు వచ్చి వివరాలు సేకరించలేదు. నేను అనేకమార్లు కలెక్టరేట్‌లో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది.- ఎస్‌.సావిత్రమ్మ, నగరవాసి

పది సార్లు దరఖాస్తు చేశాను ..

రోజువారి కూలి పనిచేసుకుని బతుకుతున్నాం. పనికెళ్తేనే పూట గడిచేది. అద్దె ఇంట్లో నివాసముంటున్నాం. ఇళ్ల స్థలాలు ఇస్తారంటే గత ప్రభుత్వంలో అనేకమార్లు దరఖాస్తు చేసుకున్నాం. అయినా ఇంటి స్థలం రాలేదు. ఇప్పుడైనా ఇస్తారని కలెక్టరేట్‌, కల్లూరు తహసీల్దారు కార్యాలయంలో, వాలంటీర్‌కు ఇలా అనేకమార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా. తీరా చూస్తే ఇళ్ల స్థలాల జాబితాలో మా పేరు రాలేదంటున్నారు.- జి.జ్యోతి, స్వామిరెడ్డి నగర్‌

అద్దె ఇల్లే దిక్కయ్యింది ..

ఈ ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నాం. మూడు నెలల క్రితం అన్ని అర్హతలు ఉన్నాయని వాలంటీర్‌ చెప్పారు.సెంట్రింగ్‌ పని చేసుకుంటూ బతుకుతున్నాం. మాకు ఎలాంటి ఆధారం లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, తదితర వివరాలను వాలంటీర్‌కు ఇచ్చాం. అందరి దగ్గర ఫొటోలు, ఆధార్‌, రేషన్‌ కార్డు పత్రాలను తీసుకుంటున్నారు. ఇంటి స్థలం వచ్చిందా లేదా అని ఇంతవరకు మాకు చెప్పలేదు.- బి.రాజేశ్వరి, బిర్లా గడ్డ

ఇదీ చదవండి:

టీ20 ప్రపంచకప్​ వాయిదా.. వచ్చేవారం అధికార ప్రకటన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.