ETV Bharat / state

ఇటలీలో కర్నూలు యువకుడి మృతి.. అలలు సముద్రంలోకి లాగేయటంతో ప్రమాదం - ఇటలీలో కర్నూలు యువకుడి మృతి వార్తలు

విదేశాల్లో ఉన్నత విద్య చదువుకున్న తనయుడు.. త్వరలోనే స్వదేశానికి వస్తాడని ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. కర్నూలుకు చెందిన చిలుమూరు శ్రీనివాసరావు కుమారుడు దిలీప్.. ఇటలీలో చదువుతున్నాడు. అయితే అతని పీజీ పూర్తైన సందర్భంగా.. అక్కడి మాంటెరుస్సో బీచ్‌కు వెళ్లారు. సాయంత్రం సమయంలో ఒడ్డు వరకు వచ్చిన అలలు లాక్కెళ్లటంతో.. దిలీప్ మరణించాడు.

kurnool student died in italy
ఇటలీలో కర్నూలు యువకుడి మృతి
author img

By

Published : Jun 12, 2022, 7:43 AM IST

కర్నూలు బాలాజీనగర్‌లోని బాలాజీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న చిలుమూరు శ్రీనివాసరావు, శారదాదేవి దంపతుల పెద్ద కుమారుడు దిలీప్‌(24) అగ్రికల్చర్‌ బీఎస్సీ చదివాక ఇటలీలోని మిలాన్‌ యూనివర్సిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్‌లో ప్రవేశం పొందారు. 2019 సెప్టెంబరులో అక్కడికి వెళ్లారు. గతేడాది ఏప్రిల్‌లో ఇక్కడికి వచ్చి సెప్టెంబరులో తిరిగివెళ్లారు.

ఇటీవల కోర్సు పూర్తయ్యాక త్వరలో ఉద్యోగం సాధించి కర్నూలుకు వస్తానని తల్లిదండ్రులకు చెప్పారు. పీజీ పూర్తయిన సంతోషంలో శుక్రవారం అక్కడి మాంటెరుస్సో బీచ్‌కు వెళ్లారు. సాయంత్రం సమయంలో ఒడ్డు వరకు వచ్చిన అలలు ఆయన్ని లాక్కెళ్లాయి. రక్షించడానికి కోస్ట్‌ గార్డులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు మృతదేహమే కనిపించింది. భౌతికకాయాన్ని స్వదేశానికి తెప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.