ETV Bharat / state

ఇష్టానుసారంగా చేయొద్దు ఎస్వీ మోహన్‌ రెడ్డి: వైకాపా ఎమ్మెల్యే హెచ్చరిక - kurnool mla hafiz khan press meet

కర్నూలు జిల్లాలో వైకాపా నాయకుల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్ హెచ్చరించారు. స్వార్థ రాజకీయల కోసం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​రెడ్డి ఇష్టానుసారంగా చేయడం సరికాదని విమర్శించారు.

kurnool mla hafiz khan fires on ex mla sv mohan reddy
మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​రెడ్డిపై ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్ ఫైర్
author img

By

Published : Feb 4, 2020, 12:36 PM IST

కర్నూలు జిల్లాలో వైకాపా కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని స్థానిక ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్ హెచ్చరించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. స్వార్థ రాజకీయ మనుగడ కోసం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​రెడ్డి పార్టీ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆరోపణలు చేశారు. తాను కర్నూలులో లేని సమయంలో తన అనుమతి లేకుండా ఎస్వీ మోహన్​రెడ్డి కొంతమందిని పార్టీలో చేర్చుకుని ఇష్టానుసారంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్ల సమయంలో తనపై ఎలాంటి కుతంత్రాలు చేశారో అందరికి తెలుసని అన్నారు.

మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​రెడ్డిపై ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్ ఫైర్

ఇవీ చూడండి:- ఈ నెలలోనే టీమిండియా సెలక్టర్ల ఎంపిక: గంగూలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.