ETV Bharat / state

గాజులదిన్నె ప్రాజెక్టుకు జలకళ... దిగువకు నీటి విడుదల - గాజులదిన్నె ప్రాజెక్ట్ లేటెస్ట్ వార్తలు

ఎగువనున్న వర్షాలకు గాజులదిన్నె ప్రాజెక్ట్ జలకళ సంతరించుకుంది. జలాశయం నిండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

gajuladhinne project
గాజులదిన్నె ప్రాజెక్టకు జలకళ... దిగువకు నీటి విడుదల
author img

By

Published : Jul 20, 2020, 7:04 PM IST

గాజులదిన్నె ప్రాజెక్టకు జలకళ... దిగువకు నీటి విడుదల

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్ట్ (సంజీవయ్య సాగర్) నిండటంతో జలాశయం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువున వర్షాలు కురవడంతో జలాశయంలోకి ఉదయం 19వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా మధ్యాహ్నానికి తగ్గింది. జలాశయం నీటి సామర్థ్యం నాలుగున్నర టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ నాలుగు టిఎంసీలు దాటడంతో జలాశయం మూడు గేట్లు ఎత్తి దిగువకు 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ జలాశయం కింద 29 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా కర్నూలు, పత్తికొండ, డోన్ నియోజకవర్గానికి తాగునీటి సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది జులైలోనే జలాశయం నిండటంతో ఆయకట్టు రైతుల్లో పంటల సాగుపై ఆశలు చిగురించాయి.

ఇవీ చూడండి- శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద ప్రవాహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.